Monday, November 16, 2015

INTRODUCTION TO "THE PHOTOSHOP STUFF"

 హాయ్ ఫ్రెండ్స్ ,

ఇంటర్నెట్ వాడకం అనేది ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది, ఒకప్పుడు డెస్క్ టాప్ కంప్యూటర్ లకి మాత్రమే పరిమితమయిన ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి డివైస్ లోకి వచ్చేసింది, ప్రతి  వంద ఫోన్ లలో సుమారు 65 ఫోన్ లలో ఇంటర్నెట్ ఉంటుంది అంటే ఇంటర్నెట్  మన నిత్య జీవితం లో ఎంతో ప్రామ్కుఖ్యం సంతరించుకుంది అనేది  మనం అర్ధం చేసుకోవచ్చు .

 నిత్యం మనం విసిట్  చేసే వెబ్ సైట్స్ దాదాపు  అన్ని కూడా  English లాంగ్వేజ్ ని  బేస్ చేసుకునే ఉంటాయి కదా , మరి  నేను కూడా ఇంగ్లీష్ లో బ్లాగ్ ని తయారు  చేస్తే ఉన్న ఆ  మిలియన్ బ్లాగుల్లో  నాది కూడా  కలిసిపోతుంది కాని దానికంటూ ప్రత్యేకత ఏం ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకు వచ్చిందే ఈ THE PHOTOSHOP STUFF బ్లాగ్ , దీనిలో  ఖచ్చితం గా ఇంగ్లీష్ అవసరం ఐన చోట మాత్రమె ఇంగ్లీష్ వాడాను ,  మిగతా చోట్ల మన వ్యావహారికమయిన తెలుగు భాషనే వాడుతూ ఈ బ్లాగ్ ని తెలుగు తో నింపే ప్రయత్నం చేస్తున్నాను .


వృత్తిరీత్యా నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ ని ,  7 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నా సొంతం, ఆ అనుభవాన్నంతా ఇక్కడ ట్యుటోరియల్స్ రూపం లో మీకు అందించబోతున్నాను... ముందుగా అడోబీ ఫోటోషాప్ గురించి , ఆ తరువాత వివిధ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్ వేర్ ల గురించి కూడా ఇక్కడ ట్యుటోరియల్స్ అందించబడతాయి , 

మీరు చేయవలసిందల్లా ఈ బ్లాగ్ ని చూసి, చదివి షేర్ చేయడమే 

ట్యుటోరియల్స్ తో  ముందు ఉంటాను 

మీ వెంకట సాయి కిరణ్